భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరుగుతోంది.ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.
ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు.కాగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.







