తెలంగాణ అధికార పార్టీ బి ఆర్ ఎస్ కు( BRS ) మరో టెన్షన్ మొదలైంది.గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీతో కొన్ని సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది.
దీనికి కారణం కారు సింబల్( Car Symbol ) పోలి ఉండే కొన్ని ఎన్నికల గుర్తులే కారణం.దీనిపై ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తులు చేస్తూనే వస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది .ఈ నేపథ్యంలో ఎన్నికల గుర్తులు విషయంలో ఆ పార్టీ ముందుగానే అలెర్ట్ అవుతుంది.
ప్రస్తుతం ఎన్నికల వ్యవహాల్లో బిజీగా ఉన్న బీఆర్ఎస్ నేతలు గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఎన్నికల గుర్తులపై దృష్టి సారించారు.గతంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులకు ఎక్కువ ఓట్లు పోల్ అవడంతో , ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అటువంటి గుర్తులపై పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.
తమ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని( Election Commission Of India ) బీఆర్ఎస్ కోరింది.
కారు గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని , దీని కారణంగా తమ పార్టీకి రావాల్సిన ఓట్లు వేరే వారికి వెళుతున్నాయని ఫిర్యాదు చేశారు.ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత,( MP Venkatesh Netha ) మన్నే శ్రీనివాస్ రెడ్డి( MP Manne Srinivas Reddy ) పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఎన్నికల గుర్తులు విషయంలో ఏర్పడుతున్న గందరగోళంపై ఈసీకి వినతి పత్రాలు అందజేశారు.ఈ గుర్తులు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఈసికి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఓ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ గుర్తులు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు .ఇంకా కారు గుర్తును పోలిన మరిన్ని గుర్తులు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని, వాటిలో టోపీ, ఇస్త్రీ పెట్టె, ట్రక్ ఆటో రిక్షా రోడ్డు రోలర్ వంటివి కారు గుర్తును ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులకు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దీనిపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.