టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్ గా( BRS ) మార్చిన కేసీఆర్ ( KCR ) దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు ఇంకా తిరగడం లేదు.అప్పుడప్పుడు మీటింగ్ లు పెడుతున్నాడు కానీ ఇప్పటి వరకు క్రియాశీలకంగా వేరే రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు అనేది జరగలేదు.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేస్తుందని అంతా భావించారు.కానీ ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ కి ఆసక్తి చూపించలేదు.
రాబోయే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) కూడా బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది.

ఇదే ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక సీట్లు దక్కించుకుంటే తప్పకుండా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అందుకే బీఆర్‌ఎస్ పార్టీ యొక్క విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
అదే కనుక జరిగితే వచ్చే ఏడాది జరగబోతున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల విషయంలో కేసీఆర్ చాలా సీరియస్ గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.

రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు బీఆర్‌ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక సీట్లను గెలుచుకోవాలి.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా గౌరవ ప్రథమైన ఓట్లను దక్కించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ముందు ముందు ఫలితాల కోసం ప్రస్తుతానికి మెల్ల మెల్లగా అడుగులు వేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నాడట.
రాష్ట్రంలో తన రాజకీయ చతురతతో అద్భుతాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ దేశంలో ఏదో ఒకటి అద్భుతం సృష్టిస్తాడు మ్యాజిక్ చేస్తాడని బీఆర్‌ఎస్ నాయకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఏంటి అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







