సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క గార్లు చేసిన వ్యాఖ్యల పై బంజారాహిల్స్ లోని తన నివాసంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఎమ్మెల్సీ కవిత కామెంట్స్…నిన్న హైదరాబాద్ లో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.సింగరేణి ఉద్యోగాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది.20 వేల నియామకాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తోంది.జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, హైదరాబాద్ లో CM లాంటి వాళ్ళు ఇవ్వటం సిగ్గు చేటు.డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తు మేమే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు.
అబద్ధాలు చెప్పటం రేవంత్ రెడ్డి మానుకోవాలి.కేసిఆర్ చేసిన పనులు మీరు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కేసిఆర్ ను ఇష్టానుసారంగా దూషిస్తున్నారు.తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఇస్తోంది ప్రభుత్వం.
మా ప్రభుత్వం తప్పు చేసింది అనుకుంటే మీరైనా సరి చేసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి.పెద్ద యెత్తున మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
TSPSC ఛైర్మెన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్న.అవినీతి ఆరోపణలు వస్తున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలి.
తెలంగాణ లో కరెంట్ కోతలు మొదలయ్యాయి.తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్ లను నియమించారు.
తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వటం లో వీళ్ళు ఎంత భాగస్వామ్యం అవుతారు.మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.తెలంగాణ అసెంబ్లీ కి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు?.రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్.
జై తెలంగాణ అని కనీసం అనని వ్యక్తి రాష్ట్ర గీతం గురించి మాట్లాడటం హాస్యాస్పదం.ఎక్కడ రాష్ట్ర గీతం పెట్టుకోవాలని రాజ్యాంగం లో లేదు.తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఏంటి?నాలాగా ఉందని తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్తున్నారు.నేను తెలంగాణ ఆడ బిడ్డనే కదా.