తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో పరిస్థితి అదుపుతప్పినట్టుగా కనిపిస్తోంది.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ల అంశంపై ప్రధానంగా పార్టీ నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతుంది.
టికెట్ల కేటాయింపు విషయంలో సర్వే నివేదికల ద్వారానే కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి విడత లిస్టును కేసీఆర్( CM KCR ) సిద్ధం చేసుకున్నారని, త్వరలోనే దానిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారనే హడావుడి జరుగుతుంది.
కొంతమంది పార్టీ కీలక నేతలు, ఇతర పార్టీలో నుంచి టిక్కెట్ హామీపై చేరిన వారిలో కొంతమందికి టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతుండడంతో, వారంతా ఇప్పుడు కేసిఆర్ వద్దే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.తమ నియోజకవర్గాల్లో తమకు టిక్కెట్ ఇస్తామంటే సరే , లేకపోతే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతూ, టిక్కెట్ హామీ పొందే ప్రయత్నం చేస్తున్నారు.అక్కడి నుంచి స్పష్టమైన హామీ వస్తే పార్టీని వీడేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీలు , మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు తమ అనుచరులతో కీలకంగా సమావేశాలు నిర్వహిస్తూ, బీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే ఏం చేయాలనే విషయంపై అంతర్గతంగా చర్చిస్తున్నారు.రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలోని( Rangareddy ) బీఆర్ఎస్ అస్వంతృప్తులు రహస్యంగా సమావేశం నిర్వహించుకున్నారు.వారంతా కలిసికట్టుగా పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారట.దీనిలో భాగంగానే జులై 30వ తేదీన బీఆర్ఎస్( BRS party ) అధిష్టానానికి డెడ్ లైన్ విధించారు.మొదటి విడత లిస్ట్ ప్రకటించే అవకాశం ఉండడంతో అసంతృప్తులు ఏదో ఒకటి తేల్చుకోవాలని భావిస్తున్నారట.ఆషాడం ముగియడంతో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతుంది.
ఎవరికి టిక్కెట్ వస్తుందనేది ఇంకా క్లారిటీ లేకపోవడంతో, ఆ లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని అసంతృప్తులు భావిస్తున్నారట.ఇప్పటికే అనేకసార్లు టికెట్ హామీ పొంది నిరాశకు గురైన వారు , ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారట.

అలాగే ఎప్పటి నుంచో పార్టీ టికెట్ పై ఆశలు పెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు ఎన్నికల్లో ఏదో రకంగా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే కాంగ్రెస్, బిజెపిలలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారట.ప్రస్తుతం ఈ టిక్కెట్ల వ్యవహారమే బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.







