తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ మేరకు గవర్నర్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.
గవర్నర్ తన పదవిని దిగజార్చే విధంగా మాట్లాడారన్నారు.కొంతమందికి తను ఇష్టం లేదని మాట్లాడటం సరికాదని వెల్లడించారు.
విమర్శలు చేయొచ్చు కానీ రాజకీయాలపై కామెంట్స్ చేయడం సరికాదని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
మరోవైపు గవర్నర్ మాటల్లో వాస్తవం లేదని ఎంపీ కేకే అన్నారు.
రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం అంటూ ఏమీ లేదని తెలిపారు.గవర్నర్ తమిళిసై తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని ఎంపీ కేకే వెల్లడించారు.







