దివంగత నేత ఎన్టీఆర్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని సీఎం కేసీఆర్ చూశారని పేర్కొన్నారు.
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని రేవంత్ రెడ్డి తెలిపారు.ఓట్ల కోసం దిగజారి బీఆర్ఎస్ ఎన్టీఆర్ ని వాడుకుంటోందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పార్టీని లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూశారని ఆరోపించారు.ఎన్టీఆర్ తో పోల్చుకోవాలని చూస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుందని వెల్లడించారు.