తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ స్వేదపత్రంను విడుదల చేసింది.ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
60 ఏళ్ల గోసను బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనా కాలంలో మాయం చేసి చూపించిందని కేటీఆర్ తెలిపారు.రాష్ట్రంలో సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
రెండో ప్రాధాన్యత విద్యుత్ రంగానికి ఇచ్చామన్న కేటీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు.మూడో ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇచ్చామని తెలిపారు.
ఇందులో భాగంగా రైతున్నలకు రైతుబీమా, రుణమాఫీ అందించామన్నారు.వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ కృషి చేసిందన్నారు.
ఇక నాలుగో ప్రాధాన్యత తాగునీటికి ఇచ్చామన్న కేటీఆర్ ఐదో ప్రాధాన్యత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఇచ్చామని స్పష్టం చేశారు.







