తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది.ఈ మేరకు తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పుతూ స్వరాష్ట్ర కల సాకారానికి బీజం పడిన రోజు కావడంతో నవంబర్ 29ని బీఆర్ఎస్ దీక్షా దివస్ గా నిర్వహిస్తుంది.
కేసీఆర్ సచ్చుడో.తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నవంబర్ 29, 2009 వ సంవత్సరంలో ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా మారింది.కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 15 ఏళ్లు పూర్తి అయింది.
రాష్ట్ర ఏర్పాటుపై కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు.ఆ తరువాత స్వరాష్ట్ర కల సాకారం అయింది.
ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం ఈ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్ గా జరుపుకుంటుంది.ఇవాళ దీక్షా దివస్ ను పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని తెలిపారు.
దీన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి ఆయన హాజరుకానున్నారు.







