పొత్తుల దిశగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ? 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) , దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పుడు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకు వెళుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది.ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 Brs, Congress Towards Alliances Brs, Congress, Janareddy,arvind Kejriwal ,  Tela-TeluguStop.com

  వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతుండడంతో, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల ఉమ్మడి శత్రువు అయిన బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు  ఈ రెండు పార్టీలు విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.విడివిడిగా పోటీ చేయడం వల్ల  బిజెపికి లాభం  చేకూరుతుందని భావిస్తున్న రెండు పార్టీ ల అగ్ర నేతలు పొత్తులు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశం అవుతున్నారు.

Telugu Brs, Central, Congress, Jana, Modhi, Rahul Gandi, Revanth Reddy-Politics

కేంద్రంలో అధికార పార్టీ బిజెపికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జెడియు అధినేత నితీష్ కుమార్, ఆర్జెడి అధినేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) వంటి వారితో భేటీ అయ్యారు.ఇక దక్షిణాదిలో డిఎంకె అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్, జెడిఎస్ అధినేత కుమారస్వామి, వామపక్ష నేతలతోనూ చర్చలు జరిపారు.ఇక ఇటీవల రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడడంతో బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల్లో ఐక్యత పెరిగింది.

Telugu Brs, Central, Congress, Jana, Modhi, Rahul Gandi, Revanth Reddy-Politics

కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి పోరాటాల్లో పాల్గొంటుంది.దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య దోస్తీకి అవకాశాలు ఏర్పడ్డాయి.ఇక తెలంగాణలో బీఆర్ ఎస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ తరచుగా ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిత్యం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై విమర్శలు చేస్తూ.

పోరాటాలు చేస్తున్నారు.కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పొత్తు పెట్టుకునే ఆలోచన తో ఉండడంతో, తెలంగాణలోనూ ఆ పొత్తు కొనసాగే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ పార్టీల పొత్తుపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి( Jana Reddy ) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube