వీడియో: వయోలిన్‌లో జాతీయ గీతాన్ని ప్లే చేసిన ఒలింపిక్స్ విన్నర్ మను భాకర్..!

2024 పారిస్ ఒలింపిక్స్‌లో( 2024 Paris Olympics ) మను భాకర్( Manu Bhaker ) చరిత్ర సృష్టించింది.

ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో గెలిచి భారతదేశానికి బ్రాంజ్ ఒలింపిక్ మెడల్ తెచ్చిపెట్టింది.

కేవలం 22 ఏళ్ల వయసులోనే, ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో( Air Pistol Shooting ) పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.ఫ్రాన్స్‌లోని చాటౌరౌక్ రేంజ్‌లో జరిగిన 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని ముద్దాడింది.2021 టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్‌లో లోపం వల్ల ఆమె నిరాశ చెందాల్సి వచ్చింది.అయితే ఈసారి విజయం మను భాకర్‌కు మరింత ఆనందాన్ని కలిగించింది.

ఈ క్రమంలోనే ఆమె మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని తెలియ వచ్చింది.తాజాగా సోషల్ మీడియాలో ఆమె వయోలిన్‌( Violin ) ప్లే చేస్తున్న వీడియో ఒకటి ప్రత్యక్షమైంది.

ఈ వీడియోలో మను భాకర్ భోపాల్‌లోని ఎంపీ షూటింగ్ అకాడమీలో వయోలిన్‌లో జాతీయ గీతాన్ని( National Anthem ) ప్లే చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.ఒక స్పోర్ట్స్‌స్టార్ జర్నలిస్ట్‌ తీసిన ఈ వీడియోలో మను భాకర్ తనకున్న మరో ప్రతిభను ప్రదర్శించింది.వైరల్ వీడియోలో మను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని వీణ వాయిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

Advertisement

ఈ వీణను ఆమె అన్నయ్య బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది.ఒలింపిక్స్ మొదలయ్యే కొన్ని నెలల ముందే ఆమె ఫస్ట్ మ్యూజిక్ క్లాస్‌లో చేరింది.ఇంత తక్కువ సమయంలోనే ఆమె చాలా బాగా వయోలిన్‌ నేర్చుకోవడం నిజంగా గ్రేట్!

ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా, దానిని 16,000 మందికి పైగా చూశారు.సోషల్ మీడియాలోని ప్రజలు మను భాకర్ చాలా ప్రతిభావంతురాలు అని, మన దేశానికి గర్వకారణం అని ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ మల్టీ-టాలెంటెడ్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వయోలిన్‌లో ప్లే చేసే అవకాశం ఉందని ఓ రిపోర్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు