'బ్రో ది అవతార్' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ టాక్ తో 70 శాతం రికవరీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్'( Bro The Avatar ) చిత్రం రీసెంట్ గానే విడుదలై అంచనాలను అందుకోలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే.మొదటి ఆట నుండే ఘోరమైన నెగటివ్ టాక్ మరియు రివ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయం లో మాత్రం ట్రేడ్ ని నిరాశపర్చలేదు.

 Bro Movie Worldwide Closing Collections,bro Movie,pawan Kalyan,sai Dharam Tej,sa-TeluguStop.com

మొదటి రోజు ఏకంగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా విడుదలై ఇదే రేంజ్ నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న చిరంజీవి ‘భోళా శంకర్'( Bhola Shankar ) చిత్రానికి క్లోసింగ్ లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు.

అలాగే రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా అనకాపల్లి నుండి అమెరికా వరకు కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ చిత్రం.ఈ సినిమా కలెక్షన్స్ ని పరిశీలించే ట్రేడ్ పండితులకు సైతం అంతు చిక్కలేదు , ఈ సినిమాకి నిజంగానే నెగటివ్ టాక్ వచ్చిందా అని.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthira Khani-Movie

పవర్ స్టార్( Powerstar Pawan Kalyan ) స్టామినా అలాంటిది మరి.ఇక ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ 20 రోజుల వరకు నాన్ స్టాప్ షేర్ వసూళ్లను రాబట్టింది.ఇది నిజంగా ట్రేడ్ కి కూడా పెద్ద షాక్.ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టుగా ఈ చిత్రం లో పాటలు, ఫైట్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు.

అందులోనూ ఇందులో పవన్ కళ్యాణ్ హీరో కూడా కాదు, గోపాల గోపాల చిత్రం( Gopala Gopala ) లో లాగ కేవలం ఒక ముఖ్యమైన పాత్ర మాత్రమే పోషించాడు.అయినప్పటికీ కూడా చాలా మంది స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలకు అనితరసాధ్యమైన షేర్స్ ని ఈ చిత్రం పెట్టింది అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాల రాకతో ‘బ్రో ది అవతార్’ చిత్రం కలెక్షన్స్ క్లోసింగ్ కి వచ్చేసింది.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthira Khani-Movie

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి లెక్కలు చూస్తే నైజాం ప్రాంతం( Nizam Area ) లో ఈ చిత్రానికి దాదాపుగా 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలాగే సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో చెరో 7 కోట్ల రూపాయిలు , నెల్లూరు జిల్లాలో కోటి 80 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.అలాగే కృష్ణ జిల్లాలో 3 కోట్ల 60 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లను రాబట్టింది.

అలాగే ఉభయగోదావరి జిల్లాలు రెండు కలిపి 10 కోట్లు , గుంటూరు జిల్లాలో 5 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 7 కోట్లు, అలాగే ఓవర్సీస్( Overseas ) లో 8 కోట్లు ,ఇలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఇదే ఆఫ్ బీట్ సినిమాని వేరే ఏ హీరో చేసిన ‘భోళా శంకర్’ చిత్రం లాగ మొదటి రోజే క్లోసింగ్ అన్నట్టు ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube