బ్రో మీదే అమ్మడి ఆశలన్నీ..!

ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాతో తెరంగేట్రం చేసిన కెతిక శర్మ( Kethika Sharma ) ఆ సినిమాతో హిట్ కొడితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది ఫ్లాప్ అవడంతో అమ్మడి బ్యాడ్ లక్ మొదలైంది.

ఇక ఆ తర్వాత నాగ శౌర్య, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలతో చేసినా సరే అవి కూడా వర్క్ అవుట్ అవలేదు.

ఏ ఇండస్ట్రీలో అయినా హిట్లు కొడుతున్న వారికే అవకాశాలు ఇస్తారు.కెతిక కు అందుకే ఛాన్స్ లు రాలేదు.

ఈ క్రమంలో కొద్దిపాటి గ్యాప్ తర్వాత కెతిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో( Bro Movie ) ఛాన్స్ అందుకుంది.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) కూడా నటిస్తున్నారు.

బ్రో సినిమాలో కెతిక పాత్ర ఏంటన్నది తెలియదు కానీ కనీసం ఈ సినిమా తో అయినా హిట్ ఖాతా తెరవాలని అనుకుంటుంది అమ్మడు.బ్రో సినిమా లో మెగా మామా అల్లుళ్లు ఫ్యాన్స్ ని అలరించనున్న్నారు.ఇప్పటికే టీజర్ సినిమాపై క్రేజ్ తీసుకు రాగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

బ్రో హిట్ పడితే మాత్రం కెతిక లక్ మొదలైనట్టే లెక్క.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు