British-Sikh taxi driver : యూకే : సిక్కు ట్యాక్సీ డ్రైవర్ దారుణ హత్య.. మృతుడి కుటుంబానికి ఆపన్న హస్తం

ఇంగ్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది.విధుల్లో వున్న ఓ సిక్కు సంతతి ట్యాక్సీ డ్రైవర్‌ను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు.

సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని వోల్వర్‌హాంప్టన్‌లో ఈ దారుణం జరిగింది.ఈ కేసుకు సంబంధించి 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

మృతుడిని 59 ఏళ్ల అనఖ్ సింగ్‌గా గుర్తించారు.నైన్ ఎల్మ్స్ లేన్‌లో ఒక ప్రైవేట్ హైర్ ట్యాక్సీ కంపెనీలో సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అతను ఓ రోజు ఒంటి నిండా తీవ్ర గాయాలతో చనిపోయి కనిపించాడు.నిందితుడు టోమాజ్ మార్గోల్‌పై హత్యానేరం నమోదు చేసి.

Advertisement

ఈ నెల ప్రారంభంలో వోల్వర్ హాంఫ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచినట్లు వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు తెలిపారు.ఈ విషాద సమయంలో తాము బాధితుడి కుటుంబానికి అండగా వుంటామని వెస్ట్‌ మిడ్‌లాండ్స్ పోలీస్ హోమిసైడ్ టీమ్‌కు చెందిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మిచెల్ థర్గూడ్ పేర్కొన్నారు.

ఎవరి వద్దనైనా సమాచారం వుంటే తమను సంప్రదించాల్సిందిగా వారు పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు.విషాద ఘటన తర్వాత బాధితుడు అనఖ్ సింగ్‌ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొందరు ముందుకొచ్చారు.

దీనిలో భాగంగా ఆన్‌లైన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Just Giving fundraiser ద్వారా ఇప్పటికే 11,000 పౌండ్‌ల (భారత కరెన్సీలో రూ.10 లక్షలు ) టార్గెట్‌ను అధిగమించినట్లుగా తెలుస్తోంది.అనఖ్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ఫండ్ రైజింగ్ పేజీలో పేర్కొన్నారు.

ఈ క్షిష్ట సమయంలో సింగ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని.విరాళాలు ఆయన కుటుంబానికి నేరుగా అందుతాయని పేజీలో తెలిపారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాగా.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్.ఆ దేశ హోంశాఖ కార్యదర్శి సుయెల్లా బ్రేవర్‌మాన్‌కు రాసిన లేఖలో బ్రిటన్‌లో సిక్కులపై జరుగుతున్న విద్వేష నేరాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.2021-22 ఏడాదికి సంబంధించి ద్వేషపూరిత నేర గణాంకాలను ఉటంకిస్తూ.అవి 169 శాతం పెరిగాయని, 38 శాతం మతపరమైన నేరాలు పెరిగాయని ప్రీత్ కౌర్ తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

అధికారిక గణాంకాల ప్రకారం.బ్రిటన్‌లో 3,36,000 మంది సిక్కులు నివసిస్తున్నారు.2021-22లో సిక్కులపై 301 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయిని.2020-21లో 112 కేసులు నమోదయ్యాయని గిల్ తెలిపారు.సుయెల్లాతో పాటు లెవలింగ్, హౌసింగ్, కమ్యూనిటీస్ (డీఎల్‌యూహెచ్‌సీ) విభాగం సెక్రటరీ సైమన్ క్లార్క్‌కు కూడా లేఖను పంపారు.2020లో బ్రిటీష్ సిక్కులపై ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ (ఏపీపీజీ) నివేదికను అమలు చేయాలని గిల్ తన లేఖలో బ్రేవర్‌మాన్‌ను కోరారు.

తాజా వార్తలు