సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు( Sikhs ) తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా యూకేలో కిర్పాణ్ (చిన్న కత్తి)( Kirpan ) వున్న కారణంగా ఓ బ్రిటీష్ సిక్కుకు( British Sikh ) అవమానం జరిగింది.కిర్పాన్ చేతిలో వున్నందున అతనిని సెక్యూరిటీ గార్డు లోపలికి అనుమతించలేదు.
వివరాల్లోకి వెళితే.బాధితుడిని జతీందర్ సింగ్‌గా( Jatinder Singh ) గుర్తించాడు.
ఇతను బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు జ్యూరీ( Birmingham Crown Court ) సర్వీసులో పనిచేస్తున్నాడు.సిక్కు మతాచారం ప్రకారం .జతీందర్ కిర్పాన్ తీసుకుని కోర్టు లోపలికి వెళ్తుండగా అక్కడ భద్రతా విధుల్లో వున్న సెక్యూరిటీ గార్డు అతనిని అడ్డుకున్నాడు.దీనిని తాను అవమానం, వివక్షగా భావిస్తున్నట్లు జతీందర్ బీబీసీకి వివరించారు.

స్మెత్‌విక్‌లోని గురుద్వారాలో ప్రెసిడెంట్, యూకే సిక్కు కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అయిన జతీందర్ సింగ్ తనను జ్యూరీ సర్వీస్‌కి( Jury Service ) పిలవడం ఇది రెండోసారని చెప్పాడు.తన కిర్పాన్‌ను ఇవ్వాలని.విధులు ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు మళ్లీ ఇస్తానని సెక్యూరిటీ గార్డు తనతో చెప్పాడని బాధితుడు పేర్కొన్నాడు.ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, ఆ సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని.
వివక్షకు సైతం గురయ్యానని జతీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై యూకే సిక్కు ఫేడరేషన్.

ఆ దేశ న్యాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్‌కి( Justice Minister Alex Chalk ) లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరింది.న్యాయమూర్తులు సరిపడనంతా వుండటంతో జతీందర్ సింగ్‌ను విధుల నుంచి తప్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కోర్టు భవనంలోకి ప్రవేశించాలనుకునే సిక్కు కమ్యూనిటీ సభ్యులకు సంబంధించి న్యాయశాఖ నిబంధనలకు తాను కట్టుబడే వున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.తాను తీసుకెళ్లిన కిర్పాన్ ఐదు అంగుళాల లోపే పొడవు వున్నట్లు ఆయన వివరించాడు.5 అంగుళాలకు మించిన పొడవున్న కిర్పాన్ లేదా బ్లేడును తీసుకెళ్లడానికి అనుమతి లేదు.







