ఆయన ఖలిస్తాన్ మద్ధతుదారుడు .. భారత సంతతి బ్రిటీష్ ఎంపీ తన్మన్‌జిత్‌పై బీజేపీ ఆరోపణలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతు పలికిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీ ఇండియా పర్యటనలో విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

రైతులు, రైతు సంఘాలు ఆయనను సత్కరిస్తుంటే.

పంజాబ్ బీజేపీ శాఖ మాత్రం తన్మన్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారుడిగా ఆరోపిస్తోంది.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ మాట్లాడుతూ కాశ్మీర్, పాకిస్తాన్, ఖలిస్తాన్‌కు సంబంధించి భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే సమస్యలను ధేసి లేవనెత్తారంటూ ఎద్దేవా చేశారు.

ఆయన ఇండియాపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందేనని.తన్మన్‌కు ఖలిస్తానీ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు వున్నాయని సుభాష్ శర్మ ఆరోపించారు.

మీడియా నివేదికల ప్రకారం.నిషేధిత ఉగ్రవాద సంస్థ Sikhs for Justice లండన్‌లో నిర్వహించిన రెఫరెండం 2020 ర్యాలీ సహా పలు సందర్భాలలో ధేసీ భారత్‌పై విమర్శలు చేశారు.

Advertisement

ఇకపోతే.కిసాన్ ఆందోళన్‌ సందర్భంగా బ్రిటీష్ పార్లమెంట్‌లో చర్చించడంతో పాటు ప్రశ్నలు సంధించారు.

ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీని వివిధ రైతు సంఘాలు ఘనంగా సత్కరించాయి.శుక్రవారం ఫగ్వారా సమీపంలోని మౌలి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

భారతీయ కిసాన్ యూనియన్ (దోబా) నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతు నాయకులు, సంయుక్త కిసాన్ మోర్చా మద్ధతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.భారత్‌లో జరుగుతున్న రైతు ఆందోళనల గురించి ఎస్‌జీపీసీ సభ్యుడు, మామయ్య పరమ్‌జిత్ సింగ్ రాయ్‌పూర్ నుంచి తన్మన్‌జిత్ వివరాలు తెలుసుకునేవారు.

ఆపై బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేవారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అంతేకాదు రైతుల సమస్యలపై భారత విదేశాంగ మంత్రితో చర్చించేందుకు గాను 36 మంది ఎంపీలు సంతకం చేసిన లేఖను యూకే విదేశాంగ మంత్రికి అందజేయడంలో తన్మన్‌జిత్ కీలకపాత్ర పోషించారు.రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జీ చేసిన వీడియోలు వైరల్ అయినప్పడు 100 మందికిపైగా బ్రిటీష్ ఎంపీల సంతకాలతో తాను యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌‌కు లేఖ రాసినట్లు తన్మన్‌జిత్ రైతు నేతలతో చెప్పారు.యూకే నుంచి అమృత్‌సర్, చండీగఢ్‌లకు మరిన్ని వివమాలను నడపాలని ఆయన కోరారు.

Advertisement

రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో సేవలందించిన సిక్కు సైనికుల కోసం సెంట్రల్ లండన్‌లో స్మారక చిహ్నాన్ని నిర్మించడం వంటి అంశాలపైనా తన్మన్‌జిత్ ప్రస్తావించారు.

తాజా వార్తలు