యూకే ఇండస్ట్రి విభాగానికి అధిపతిగా భారత సంతతి ఎంపీ .. మన తెలుగువాడే!

భారత సంతతికి చెందిన బ్రిటీష్ పీర్ (ఎంపీ) లార్డ్ కరణ్ బిలిమోరియాకు( Karan Bilimoria ) కీలక పదవికి దక్కింది.

యూకేలో అత్యంత ప్రభావంతమైన ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ కింగ్‌డమ్ (ఐసీసీయూకే)( International Chamber of Commerce United Kingdom ) ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు.

కొత్త హోదాలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం . ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) చర్చలను తిరిగి ప్రారంభించడాన్ని ఆయన స్వాగతించారు.ఇకపోతే కరణ్ మన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు.

బేగంపేటలోని ప్రఖ్యాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేశారు.కోబ్రా బీర్ వ్యవస్ధాపకుడైన బిలిమోరియా నూతన సంవత్సరంలో ఐసీసీయూకే( ICCUK ) పగ్గాలు చేపట్టనున్నారు.

ఇప్పటి వరకు ఈ పదవిలో వ్యాపారవేత్త పాల్ డ్రెచ్‌స్లెర్ ఉన్నారు.గడిచిన నాలుగేళ్లుగా ఐసీసీని అంతర్జాతీయ వేదికపై విశ్వసనీయ సంస్థగా నిలబెట్టడానికి తాము పనిచేశామని పాల్ తెలిపారు.

Advertisement

పెట్టుబడులు, ఆర్ధిక పునరుద్ధరణను ప్రోత్సహించే వాణిజ్య విధానాలను నడిపామని.కరణ్ నాయకత్వంలో ఐసీసీ తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు.

బ్రెజిల్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో కైర్ స్టార్మర్,( Keir Starmer ) నరేంద్ర మోడీ( Narendra Modi ) మధ్య ద్వైపాక్షిక సమావేశం నేపథ్యంలో ఇండో యూకే మధ్య ఎఫ్‌టీఏపై చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.వస్తువులు, పెట్టుబడులు, సేవలలో రెండు దేశాలకు భారీ ప్రయోజనాలు ఉన్నాయని తన నియామకం సందర్భంగా కరణ్ పేర్కొన్నారు.భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్ధిక వ్యవస్ధ అని, భారతీయ కంపెనీలు ఇప్పటికే యూకేలో గణనీయమైన స్థాయిలో పెట్టుబడిదారులుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) 170 దేశాలలో 1 బిలియన్ ఉద్యోగులతో 45 మిలియన్ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ .ఐసీసీయూకే అనేది యూకేలోని ఛాంబర్ వాయిస్.అంతర్జాతీయ విధానం, ప్రమాణాలు, నియమాలను రూపొందించడంలో యూకే పరిశ్రమ వర్గాలు ప్రభావవంతంగా పాల్గొనేలా ఇది చొరవ చూపుతుంది.

కెనడా - బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ
Advertisement

తాజా వార్తలు