నరేంద్ర మోడీ తమ్ముడు కే‌సి‌ఆర్ అంటూ బృందా కారత్ వ్యాఖ్యలు

సి‌పి‌ఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభలో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ నరేంద్ర మోడిపై విమర్శలు చేశారు.

మోడి నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను రోడ్డుకు ఈడ్చారని ఆరోపించింది.

అంబానీ, ఆదానీలకు దేశాన్ని తకట్టు పెట్టాడు అని అన్నారు.దేశవ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తుంటే.

చర్చల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆమె ఆరోపించింది.దేశానికి అన్నం పెట్టె రైతే నేడు రోడ్డుపైకి వచ్చాడు.

ఇలాంటి పరిస్థితి ఎవరికి రవొద్దని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ మాత్రం ఉదయం ఓ మాట, సాయంత్రానికి మరో మాట మాట్లాడుతారని ఆమె అన్నారు.

Advertisement

హరితహారం పేరుతో పెదల భూములు లాక్కోవాలని కే‌సి‌ఆర్ చూస్తున్నాడు.రెండు లక్షల మంది ఆదివాసులు పోడు పట్టాల కోసం ధరఖాస్తు చేసుకుంటే అందులో సగం కూడా ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కే‌సి‌ఆర్ మోడి కి తమ్ముడుగా వ్యవహారిస్తున్నాడని ఆమె అన్నారు.తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు మిలిటెంట్ పోరాటాలు చేస్తాం అన్నాడు.

Advertisement

తాజా వార్తలు