సాధారణంగా ఎవరైనా ప్రముఖులు వాడే వస్తువులపై అందరికీ విపరీతమైన ఆసక్తి ఉంటుంది.ముఖ్యంగా దుస్తులు, కళ్లజోళ్లు, వాచ్‌లు, దుస్తులు ఇలా ఎవరైనా అత్యంత ఖరీదైనవి ధరిస్తే నోరెళ్లబెడుతుంటాం.
ఇదే కోవలో ఓ ముఖ్యమంత్రి వద్ద ఉన్న సూట్ కేస్‌కు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది.అయితే అదేమీ బంగారం, వెండి, వజ్రాలతో తయారు చేయలేదు.
అయినప్పటికీ దానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బుధవారం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌తో వెళ్లారు.ఆయన ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకున్నారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు సీఎం చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి చేరుకున్నారు.ఆవు పేడతో చేసిన బ్రీఫ్ కేస్‌తో లోపలికి ప్రవేశించారు.
అందులో బడ్జెట్ పేపర్లు పెట్టి లోపలికి దర్జాగా వచ్చారు.దీంతో ఆ బ్రీఫ్ కేస్ గురించి జాతీయ స్థాయిలో చర్చ ఏర్పడింది.
దానిని 10 రోజుల పాటు శ్రమించి, తయారు చేసినట్లు తెలుస్తోంది.
చత్తీస్‌ఘడ్‌లో సీఎం భూపేష్ బఘేల్ పాడి పరిశ్రమను లాభదాయకంగా మార్చడానికి చర్యలు తీసుకున్నారు.2020లో ఆవుల పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దేశంలోనే ఇలా ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది.
గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా ఆవు పేడ సేకరించి, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా దానిని వినియోగించేలా సర్కారు అవగాహన కల్పిస్తోంది.ఇందులో భాగంగానే సీఎం భూపేష్ భగల్ స్వయంగా ఆవుపేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌తో కనిపించారు.