వివాహం( Weddubg ) అంటే వరుడు, వధువు ఇద్దరికీ ఒక మరుపురాని ఘట్టం.వివాహం అనంతరం భార్యాభర్తలు గా మారి ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టి మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించినట్లు అనిపిస్తుంది.
అయితే వివాహం అంటే ఒకపక్క సంతోషంతో పాటు మరొక పక్కా కాస్త భయంగా కూడా ఉంటుంది.ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు చాలా వేరుగా ఉంటే సమస్యలు మొదలవుతాయి అందుకే కాస్త భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
ముఖ్యంగా మహిళలకు భయం అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వివాహం తర్వాత భర్తతో పాటు అత్తమామలు తనను ఎలా చూసుకుంటారో, తనతో ఏ విధంగా ఉంటారో అనే ఆలోచనలు కూడా కాస్త యువతులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.అయితే ఇలాంటి విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వధువు కాజల్( Bride Kajal ) పెళ్లికి ముందే కాబోయే వరుడికి షాక్ ఇచ్చింది.పెళ్లి మండపం ముందు నిలబడి వధువు స్నేహితులు వరుడితో కండిషన్స్ అగ్రిమెంట్ పై( Conditions Agreement ) సంతకం చేయించుకోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా అవాక్కయ్యారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.వధువు కాజల్ కూడా ఆ వీడియోను స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ వీడియోలో వధూవరువులు ఇద్దరు కళ్యాణం మండపం లోకి అడుగుపెడుతుండగా వధువు స్నేహితులు వెడ్డింగ్ కాంట్రాక్ట్ పేపర్( Wedding Contract ) పట్టుకుని నిల్చుని ఉన్నారు.ఆ కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తానని తెలపడంతో వరుడు సంతకం పెట్టేసాడు.ఆ అగ్రిమెంట్లో.కాజల్ ను ఎప్పుడు సురక్షితంగా ఉంచాలి.ఆమె చెప్పిన పనులు కచ్చితంగా చేయాలి.కాజల్ ఎప్పుడు ఏమి అడిగితే అది తెచ్చివ్వాలి.
సంవత్సరానికి కనీసం మూడుసార్లు అయినా కాజల్ ను టూర్లకు తీసుకెళ్లాలి.ఎల్లప్పుడూ కాజల్ సంతోషంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.కాజల్ ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు.అనే కండిషన్లు రాసి ఉన్నాయి.







