వైరల్ వీడియో: ఆహా వధువు ఎంట్రీ మామూలుగా లేదే..

ప్రస్తుత జనరేషన్‌ యూత్ తమ వివాహాల్లో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు.పెళ్లి పత్రిక నుండి వివాహ తంతు వరకు ఏదో ఒక విషయంలో సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

 Bride Uses Balloons To Make Her Veil Float Goes Viral Details, Viral Video, Late-TeluguStop.com

పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఆ పెళ్ళి వేడుకలో( Wedding ) ప్రత్యేకతలను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకా కొన్ని పెళ్లిళ్లు చూస్తే అబ్బా! అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ రా బాబు అనే విధంగా ఉంటాయి.

సరిగ్గా అలానే ఒక జంట కూడా తమ పెళ్లిని చూసి బంధుమిత్రులు నోరెళ్లబెట్టేలా ప్లాన్ చేసుకున్నారు.ఒక పెళ్లి జంట పెళ్లి మండపానికి ఒక రేంజ్ లో వచ్చి అదరగొట్టేసారు.పెళ్లికి వచ్చినవాళ్లంతా పెళ్లి కూతుర్ని( Bride ) చూసి షాక్ అయ్యారు.అసలు ఆ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ పెళ్లికూతురు అచ్చం మహారాణిలా( Queen ) కనపడింది.

మాములుగా పాతకాలంలో మహారాణులు వచ్చేటప్పుడు వారి వెనుకవైపు ఒక పొడువాటి క్లాత్ ని తమ సేవకులు మోసుకుంటూ తీసుకెళ్తారు.

అయితే ఇక్కడ జరిగిన పెళ్ళిలో మాత్రం ఆ పెళ్లికూతురు వెనక ఉన్న క్లాత్ ని బెలూన్స్( Balloons ) సహాయంతో పైకెత్తించి వధువును స్టేజ్ మీదకు తీసుకొచ్చారు.ఆ వధువు స్టైల్ గా వరుడి చేతిలో చెయ్యి వేసి మండపం లోపలికి వస్తుంటే బంధుమిత్రులంతా నోరేళ్ళబెట్టి మరి అలా చూస్తుండిపోయారు.ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వెరైటీ పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube