మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
రాయగఢ్ జిల్లా రెపోలి వద్ద ముంబై – గోవా జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
కాగా కారు అతివేగంగా రావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.