తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు మరికాసేపటిలో సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.అయితే గతంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇవాళ ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు.







