అనంతపురం జిల్లాలోని ఎస్ కే యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమానికి బ్రేకులు పడుతున్నాయి.మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారని తెలుస్తోంది.
అయితే రేపు యూనివర్సిటీలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తున్నామని వైస్ ఛాన్సలర్ చెప్పిన విషయం తెలిసిందే.దీనిపై బోధన, బోధనేతర సిబ్బంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దీంతో హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.కాగా పలు కారణాలతో వర్సిటీ సిబ్బంది చనిపోవడంతో హోమాన్ని నిర్వహించాలని సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే.







