షారుక్ ఖాన్ ఇన్ స్టాలో ఎంతమందిని ఫాలో అవుతున్నారు తెలుసా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బి టౌన్ ఇండస్ట్రీని ఏలుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయనను గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడుతున్నాయి.

 Do You Know How Many People Follow Shahrukh Khan On Instagram Details, Shahrukh-TeluguStop.com

ఈ క్రమంలోనే అందరూ షారుక్ ఖాన్ పని అయిపోయిందని భావించారు.అయితే ఈయన మాత్రం పఠాన్ సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు.

దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా గత నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లను సాధించింది ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.ఇక షారుక్ ఖాన్ హీరోగా మిలియన్ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ హీరో తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదిక కూడా ఈయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే షారుఖ్ కు 36 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం అయితే ఇలా మిలియన్స్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నటువంటి షారుక్ ఖాన్ ఇంస్టాగ్రామ్ లో కేవలం 6 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు మరి ఈయన ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరు అనే విషయానికి వస్తే ఈయన భార్య గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్, తన కుమార్తె సుహానా ఖాన్, తన మేనకోడలు గౌరీ ఖాన్ సోదరుడి కుమార్తె ఆలియా చిబా, షారుఖ్ పర్సనల్ మేనేజర్ పూజా దద్లానీ, ఇక ఈయన ఫాలో అవుతున్న చివరి వ్యక్తి  కాజల్ ఆనంద్.ఈమె షారుఖ్ కు బెస్ట్ ఫ్రెండ్.ఇలా షారుక్ ఖాన్ ఈ ఆరుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube