యాదాద్రి ఆలయంలో భక్తులకు అందుబాటులో బ్రేక్ దర్శనం..!

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్‌ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానుంది.

తిరుమల తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కాగా, ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం గుండా వెలుపలి ప్రాకార మండపంలో, త్రితల రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు.ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారని ఆలయ ఈవో తెలిపారు.బ్రేక్‌ దర్శన సమయంలో ధర్మ దర్శనం, రూ.150 దర్శనం నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు.బ్రేక్‌ దర్శనానికి ఒక్కొక్కరికి రూ.300 ఉంటుందన్నారు.బ్రేక్‌ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయంలో హారతిని ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయని స్పష్టం చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు