2024లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అలా చెప్పారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాలని ఆయన అభిమానులలో ప్రతి అభిమాని కోరుకుంటున్నారు.2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది భావిస్తుంటే 2024 ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని మరి కొందరు భావిస్తున్నారు.

అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ సీఎం అవువాడని పరోక్షంగా చెప్పారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కాలజ్ఞానంలో "తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! రాజవారసత్వము నశించినయ! ప్రజారాజ్యము విలసిల్లునయ! తప్పదు నా మాట నమ్మండయ!" అని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఉన్న ఒక ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఫోటోను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వస్తే ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేశారు.

Advertisement

పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం చేస్తున్నారు.రైతులకు గిట్టుబాటు ధర వద్దని లాభసాటి ధర ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు.పవన్ స్వార్థం లేకుండా ప్రజల మంచి కోసం రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉంది.తిరుపతి నుంచి పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలవడం గ్యారంటీ అనే భావన ఎక్కువమందిలో ఉంది.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో నిజమవుతాయో లేదో చూడాలి.

దసరా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు.పవన్ ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు