హైదరాబాద్ గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.సుమారు ఆరు ఎకరాల్లో బ్రాహ్మణ సదన్ భవనాన్ని నిర్మించారు.
ఈ క్రమంలో యాగశాల వద్ద పూర్ణహుతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
బ్రాహ్మణులకు గౌరవ భృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.అదేవిధంగా ధూప దీప నైవేధ్యాలకు నెలకు రూ.10 వేలకు పెంచారు.అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ బ్రాహ్మణుల్లోనూ చాలా మంది పేదలున్నారని తెలిపారు.బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు.విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని రూ.12 కోట్లతో నిర్మించామని వెల్లడించారు.







