సోషల్ మీడియాలో( Social Media ) ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం.అందుకే చాలామంది అది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చెబుతారు.
యుక్త వయస్సులో వున్న వారు పాటలు( Songs ) పాడితే అవి వైరల్ అయితే మనం పెద్దగా ఆశ్చర్యపోము.ఓ పెద్దవయసు వ్యక్తి పైగా 60 ఏళ్ళు దాటిన వ్యక్తి పాడిన ఓ పాట వైరల్ కావడం ఇపుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అతను పాత పంజాబీ పాట ‘జిదా దిల్ తుట్ జాయే’ను( Jida Dil Tut Jaye ) బిందెమీద దరువు వేస్తూ పాడగా ఈ పాట ప్రస్తుతం నెట్టింట పెనుదుమారాన్ని సృష్టిస్తోంది.

ఈ పాటను మొదట నూర్ జెహాన్ పాడారు.కాగా ఆమెను అనుకరిస్తూ.నేపథ్య సంగీతం కొరకు తన చేతిలోని అల్యూమినియం బిందెను వాడుతూ.
అతగాడు దరువు వేయడం ఇపుడు అందర్నీ అబ్బురపరుస్తుంది.ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.
ఈ క్రమంలో ఎంతోమంది ఆ పాటను మెచ్చుకుంటున్నారు.ఇక ఈ వీడియోకి “అందమైన పాట… మీకు పంజాబీ అర్థం అయితే ఈ పాట ఎంతో సొగసైనదని తెలుస్తుంది!”అని క్యాప్షన్ కూడా ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు.

పాటకు తగ్గట్టుగా ఆయన హావభావాలు, పాటలో హెచ్చుతగ్గులు. గురించి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.రాగం, లయ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి అంటూ కొంతమంది కామెంట్ చేస్తే, పెద్దమనిషి పంజాబీ జానపద సంగీతాన్ని నిజంగా శ్రవణానందంగా ఆలపించారు అని కొందరు కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.హృదయ స్పందనకు.
ప్రేమ కథలకు భాష అడ్డంకి కాదు అని మరికొంతమంది కామెంట్ చేస్తే….ప్రపంచం ఒక కళాకారుడిని కనుగొంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.







