తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినా రాధికా ఆప్టే నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.లెజెండ్ సినిమా రాధికా ఆప్టేకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ పదుల సంఖ్యలో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.అయితే వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే నటీమణిగా రాధికా ఆప్టేకు పేరుందనే సంగతి తెలిసిందే.
బోల్డ్ పాత్రల్లో నటించి ఆ పాత్రలతో మెప్పించే ప్రతిభ ఉన్న రాధికా ఆప్టే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వివాదం గురించి బాలీవుడ్ హీరోయిన్లు ఎవరూ స్పందించడం లేదు.గతంలో మీటూ సంఘటన జరిగిన సమయంలో నోరు విప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే ఇప్పుడు సైలెంట్ గా ఉండటంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ట్విట్టర్ యూజర్లు ఏకంగా బైకాట్ రాధికా ఆప్టే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం.రాధికా ఆప్టేతో పాటు మరికొందరు హీరోయిన్లపై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
రాధిక గతంలో చేసిన కొన్ని గ్లామర్ రోల్స్ ను కూడా తప్పుబడుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.రాధికా ఆప్టే ఈ వివాదం గురించి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది.

గతంలో రాధిక తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో నిలిస్తే ప్రస్తుతం తన తప్పు లేకపోయినా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.రాధిక భారతీయ సంస్కృతిని నాశనం చేస్తోందని రాధికా ఆప్టే సినిమాలను చూడకూడదంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాధికా ఆప్టే భవిష్యత్తులో నటించబోయే సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.