Skanda : జగన్ ఫ్రీ సీమ్స్ పై, బూమ్ బూమ్ మద్యంపై స్కందలో సెటైర్లు.. సీఎంలను అలా చూపించారంటూ?

బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో రామ్ పోతినేని( Rampothineni ) శ్రీ లీల( Sreeleela ) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్కంద( Skanda ) ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.అయితే ఈ సినిమా తరువాత ఎలాంటి ఫలితాలను అందు కుంటుందో స్పష్టంగా తెలియనుంది.

 Boyapati Srinu Satires On Ap And Telangana Cms In Skanda Movie-TeluguStop.com

ఇక బోయపాటి సినిమా అంటేనే ఎలాంటి మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఉంటాయో మనకు తెలిసిందే.ఎప్పటిలాగే స్కంద సినిమాలో కూడా ఈయన యాక్షన్ సన్నీ వేషాలతో అందరిని ఆకట్టుకున్నారు.

అయితే ఈసారి కూడా ఈయన తన సినిమాలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ భారీగానే ఆకట్టుకున్నాయని చెప్పాలి.అయితే వీటిని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా బోయపాటి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది.

Telugu Andhra Pradesh, Boyapati Srinu, Cm Jagan, Cm Kcr, Ram Pothineni, Skanda,

ఈ సినిమా మొదటి హాప్ లో రచ్చ రవి ఉచితాలతో జనాన్ని ఎలా మోసం చేయవచ్చో, ఎంత అమాయకంగా ఓట్లు గుద్దేస్తారో డైలాగు రూపంలో చెప్పిన తీరును బోయపాటి ఎవరిని ఉద్దేశించి పెట్టారో స్పష్టంగా అర్థం అవుతుంది.అలాగే సెకండ్ హాఫ్ లో రామ్ బాబాయి పాత్రలో నటించేటటువంటి వ్యక్తి తనకు బూమ్ బూమ్ మద్యం కావాలి అంటూ చెప్పడం కూడా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టే ఉంది.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను బోయపాటి ఇందులో రౌడీలుగా చూపించడం గమనార్హం.

Telugu Andhra Pradesh, Boyapati Srinu, Cm Jagan, Cm Kcr, Ram Pothineni, Skanda,

ఇక బోయపాటి ( Boyapati Sreenu )రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఈ కథ రూపొందించినప్పటికీ ఎక్కువగా ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఇందులో డైలాగ్స్ పెట్టారని స్పష్టంగా సినిమా చూస్తే అర్థమవుతుంది.అయితే సినిమాకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో ఈ డైలాగ్స్ పెద్దగా జనాలలోకి వెళ్లలేదు కానీ ఈ సినిమా కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఈ డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచావని చెప్పాలి.ప్రతి సినిమాలో కూడా బోయపాటి ఇలా రాజకీయాలను టచ్ చేస్తూ పొలిటికల్ డైలాగ్స్ పెడుతున్న విషయం మనకు తెలిసిందే.

ఆఖండ సినిమాలో అయితే ఈ రాజకీయ పంచ్ డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్లలో కూర్చొనివ్వ లేకపోయాయని చెప్పాలి.మరి అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్నటువంటి సినిమాలో ఇంకెన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉంటాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube