బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinu ) అంటేనే ఫుల్ ఊర మాస్.ఈయన సినిమాల్లో మాస్ యాక్షన్ తో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయి.
ఇప్పటికే ఈయన చాలా సినిమాలు తీశారు.వాటిల్లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.
ఇక అఖండ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత బోయపాటి రామ్ పోతినేనితో ”స్కంద”( Skanda ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.
మరో 20 రోజుల్లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా కూడా అఖండ సినిమాలా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదంటే అట్టర్ ప్లాప్ అయ్యి షాక్ ఇస్తుందో చూడాలి.కాగా ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య( Balakrishna ), బోయపాటి కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా కూడా అయ్యాక బోయపాటి పాన్ ఇండియన్ హీరోను లైన్లో పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇతడు కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనిపించు కోవాలని తహతహ లాడుతున్నాడు.ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమాను బోయపాటి టచ్ చేయలేదు.
రామ్( Ram Pothineni ) కు పాన్ ఇండియన్ మార్కెట్ లేకపోవడంతో ఈయనతో పాన్ ఇండియన్ మూవీ చేయలేదు.కానీ నెక్స్ట్ సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియన్ సినిమా( Pan India Movie )నే చేయాలని అనుకున్నారట.అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను లైన్లో పెడితే సెట్ అని ఆలోచిస్తున్నారట.ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నాడట.త్వరలోనే అల్లు అర్జున్ ( Allu Arjun )కు వినిపించి ఓకే అంటే బాలయ్య మూవీ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే సరైనోడు వంటి మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబో రిపీట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయం.