అది విజయం సాధిస్తే బోయపాటి ముందు బోలెడు ఆప్షన్స్‌

నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం వహించాడు.

 Boyapati Movie Skanda Release This Week Details, Boyapati Movie, Sreeleela, Ram-TeluguStop.com

అఖండ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఎట్టకేలకు రామ్ హీరో గా రూపొందించిన స్కంద సినిమా( Skanda Movie ) తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తన గత చిత్రం ఆఖండ మాదిరిగానే భారీ యాక్షన్‌ చిత్రం గా స్కంద చిత్రాన్ని రూపొందించినట్లుగా ట్రైలర్ మరియు టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.

గతం లో లెజెండ్ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా ను రూపొందించి డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి స్కంద సినిమా సూపర్ హిట్ అయితే పలువురు స్టార్ హీరోలు బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.ముఖ్యంగా అల్లు అర్జున్ తో( Allu Arjun ) పాటు బాలకృష్ణ( Balakrishna ) మరో ఇద్దరు హీరోలు ఎప్పుడు బాలయ్య తో సినిమా బోయపాటి తో సినిమా చేద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాప్ వినిపిస్తుంది.

ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్కంద సినిమా లో రామ్( Ram Pothineni ) మరియు శ్రీ లీల( Sreeleela ) జంటగా నటించారు.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో రామ్ లుక్ ఇంకా శ్రీ లీల డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ సినిమా లో దర్శకుడు బోయపాటి చూపించాడనే సమాచారం.

మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది.ఆ తర్వాత బోలెడన్ని ఆఫర్లను పార్టీ అందిపుచ్చుకుంటాడా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube