ఇక్కడ అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ వస్తారు... రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవే!

నేటి యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు మరమనుషుల్లాగా మారడం వలన పిల్లలు టీనేజ్ కి రాకముందే ప్రేమలో పడటం పరిపాటిగా మారింది.

తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడటం వలన వారి బంధాలు బీటలు వారుతున్నాయి.

ఈ క్రమంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్‌ మోసం చేసాడని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.చాలా మంది తీవ్ర మనో వేదనకు గురవుతుంటారు.

ఇష్టపడ్డ వ్యక్తి మోసం చేశాడని, కోరుకున్న ప్రేమ దక్కలేదని బాధపడుతుంటారు.అలాంటి వాళ్లకోసమే బెంగళూరుకు చెందిన కొందరు యూత్ కలిసి ఒక వెబ్‌సైట్ ప్రారంభించారు.

దానిపేరు ‘టాయ్ బాయ్.’ ఈ పేరుతో రూపొందిన ఈ వెబ్‌సైట్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్‌ను వారు అద్దెకిస్తారు.

Advertisement

అలాగని ఈ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలతోపాటు బయటికి మాత్రం రారు సుమా.బాయ్ ఫ్రెండ్‌ని సినిమాలు, షాపింగ్, రెస్టారెంట్లు వంటి వాటికి తీసుకెళ్దామంటే ఇక్కడ కుదరదు.

ఎందుకంటే ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ కేవలం ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాడు.వ్యక్తిగతంగా ఎవరినీ కలవడు.

ఎవరైనా అమ్మాయిలు మానసిక వేదన, ఒత్తిడిలో ఉంటే.వారితో ఫోన్ ద్వారా మాట్లాడుతాడు.

అమ్మాయిల సమస్యను విని, వాళ్ల ఆందోళనను, వేదనను తొలగించేందుకు ప్రయత్నిస్తాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన వారికి మానసిక వేదన తొలగించి, వారిని మరలా పూర్వం మాదిరి చాలా స్ట్రాంగ్ గా తయారు చేయడమే ఈ వెబ్ సైట్ సర్వీస్ ఉద్దేశం.యూజర్లు తమ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు.అయితే దీనికి వారు కొంత రుసుము ఛార్జ్ చేస్తారు.

Advertisement

గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు.ప్రస్తుతం ఇదొక స్టార్టప్ మాత్రమే.

జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి.అయితే, ఇలాంటి సైట్లు, సేవల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

తాజా వార్తలు