ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఫామ్ తో దూసుకుపోతోంది.తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ-20 సిరీస్లో భాగంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భారత జట్టు అలవోకగా విజయం సాధించి సిరీస్ పై కన్నేసింది.
అయితే నిన్న జరిగిన మ్యాచ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టువంటి న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.అయితే ఇందులో లో ఓపెనర్లు ఇద్దరూ మంచి స్కోరు తో ఓపెనింగ్స్ రాబట్టిన వారికి సహకరించిన వారు లేకపోవడంతో 132 పరుగులకే పరిమితమైంది.అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టువంటి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది.
అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా ప్రస్తుతం భారత్ జట్టు తెలుగులోని ఫామ్ లో ఉందని, అంతేగాక క్రికెట్ ప్రపంచాన్ని భారత్ ఏలుతోందని కితాబిచ్చాడు.
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే తరహాలో విజృంభించిందని కానీ అప్పుడు ఆస్ట్రేలియా జట్టుకి భారత్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్లు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ఆస్ట్రేలియా జట్టుదే పైచేయిగా ఉండేదని అన్నాడు.

ప్రస్తుతం భారత జట్టు ఉన్నటువంటి ఫామ్ ని బట్టి చూస్తే 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని, అంతేగాక ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్లో భాగంగా జరిగినటువంటి మొదటి మ్యాచ్ లో రెండు వందల పైచిలుకు లక్ష్యాన్ని కూడా భారత ఛేదించినప్పటికీ న్యూజిలాండ్ మేలుకోలేదని, అసామాన్య ప్రదర్శన కనబరుస్తున్న టువంటి భారత జట్టుపై గెలవాలంటే ఇటువంటి చిన్న చిన్న లక్ష్యాలు సరిపోవని భారీ పరుగుల లక్ష్యాలు కావాలని సూచించాడు.అయితే ఈ సిరీస్లో భాగంగా మూడవ మ్యాచ్ బుధవారం రోజున 12.30 నిమిషాలకు జరగనుంది.