ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు కొత్త కాదు.సినిమా అయినా, రాజకీయం అయినా అక్కడంతా కులాల పైనే నడుస్తుంది.
ఇందులో వింతేమీ లేదు.అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మరీ పబ్లిగ్గానే కులం పేరుతో తిట్టుకోవడం ఎక్కువైపోయింది.
ఏకంగా మంత్రులే కులం వ్యాఖ్యలు చేస్తూ వివాదం రేపుతున్నారు.

ఇప్పటికే అమరావతిపై కుల ముద్ర వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖపట్నంపైనా అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.అమరావతి మొత్తం ఒకే సామాజికవర్గం చేతుల్లోనే ఉందని గతంలో ఇదే బొత్స వ్యాఖ్యానించి సంచలనం రేపారు.ఇప్పుడు విశాఖలో రాజధాని ఏర్పాటు చేసినా కూడా చంద్రబాబు కులానికి లబ్ధి చేకూరుతుంది తప్ప తమ కులానికి కాదని ఆయన అనడం విశేషం.
ఇది కూడా అంతర్గతంగా సన్నిహితులతో చేసిన కామెంట్స్ కాదు.పబ్లిగ్గా మీడియా ముందే అంటున్నారు.అమరావతి అయితే కొత్తగా నిర్మిస్తున్న నగరం.అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది.
చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్లే భూములు కొన్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది.కానీ విశాఖపట్నం అలా కాదు.
ఇది అభివృద్ధి చెందిన నగరం.

ఈ నగరం దేశంలోని వివిధ సంస్కృతుల సమ్మేళనం.కానీ అలాంటి నగరంపై కూడా ఇప్పుడు బొత్స.కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
విశాఖను అభివృద్ధి చేస్తే అది చంద్రబాబు సామాజిక వర్గానికి ఎలా మేలు చేస్తుందో ఆయన చెప్పడం లేదు.పోనీ అదే నిజమైతే మరి రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాల్సిన అవసరమేంటో కూడా బొత్స వివరించలేకపోతున్నారు.