వెండితెరను ఏలినటువంటి అందాల తారలలో దివంగత నటి శ్రీదేవి( Sridevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి శ్రీదేవి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ప్రేక్షకులను మెప్పించారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు అందరి సరసన నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా సంచలనాలను సృష్టించారు.ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఇండియన్ చిత్ర పరిశ్రమకే ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకోవచ్చారు.ఇలా తన చివరి శ్వాస వరకు ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉన్నటువంటి శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24వ తేదీ దుబాయ్ లోని ఒక హోటల్లో అకస్మాత్తుగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ అనే చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.అయితే ఈమె జీవిత కథను కనుక ఒక సినిమాగా చేస్తే మంచి సక్సెస్ అవుతుందని ఎంతోమంది శ్రీదేవి బయోపిక్( Sridevi Biopic ) సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే శ్రీదేవి బయోపిక్ సినిమాకు తాను అనుమతి ఇవ్వనంటూ ఇటీవల బోనీ కపూర్( Boney Kapoor ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్ ఆమె జీవితం కూడా ప్రైవేటుగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను బ్రతికినంత వరకు ఆమె బయోపిక్ సినిమాకు అనుమతి ఇవ్వనంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







