విజయవాడ సెంట్రల్: గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన వైసిపి దాడి విషయమై మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.జగన్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాష్ట్రంలో సైకో పాలన సాగిస్తున్నారని పోలీసులు విశ్వవిగ్రహాలుగా మారిపోయారని రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోండా ఉమా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్.జగన్ అధికారంలోకి వచ్చాకనే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంది .ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారు.రాష్ట్రం లో సైకో పాలన సాగుతుంది.
కొంత మంది పోలీసులు ప్రమోషన్ కోసం ఉత్సవ విగ్రహాలలాగా మారిపోయారు.
వైసీపీ కండువాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు,లోకేష్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజా స్పందన తట్టుకోలేక అనేక దాడులు చేస్తున్నారు.
రాజారెడ్డి రాజ్యాంగం అనపర్తి లో అమలుచేశారు.పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వారిని అరెస్ట్ చేస్తున్నారు.
పట్టాభిని నిన్న అరెస్ట్ చేసి స్టేషన్ మార్చి మార్చి తిప్పుతున్నారు.ఊమెన్ పోలీసులు లేకుండా మా మహిళా నాయకులను అరెస్ట్ చేశారు.
కార్లు తగలపెట్టి,కార్యాలయం పై దాడిచేస్తుంటే పోలీసులు చూస్తూ నిల్చున్నారు.ప్రజలకు,ప్రతిపక్ష పార్టీలకు రక్షణ కల్పించలేని పోలీసులు రాజీనామా చెయ్యాలి.
రాష్ట్రంలో రుల్ ఆఫ్ లా ఎక్కడుంది.ఈరోజు నీది కావచ్చు రేపు అనేది వుంటుందని మర్చిపోవద్దు.
టిడిపి నీ ఎవ్వరూ అడ్డుకోలేరు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.







