తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైతే పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యిందో దానివల్ల హిందీ చిత్ర పరిశ్రమ నష్టాల పాలవుతూ వస్తోంది.ఇన్ డైరెక్ట్ గా దీనికి మనం బాధ్యులం అవుతామో లేదో తెలియదు కానీ అక్కడ నటీనటులకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాము.
హిందీలో అవకాశాలు లేక చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్టిస్టులు సౌత్ ఇండియాకి వచ్చేసరికి విలన్స్ గా భారీ పారితోషకాలు అందుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది తెలుగు సినిమాల్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ లుగా అదరగొడుతున్న హిందీ స్టార్స్ ఎవరు? ఏ మేరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదట కేజిఎఫ్ 2 లో సంజయ్ దత్( Sanjay Dutt ) ఎంట్రీ ఇచ్చిన కూడా ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం బిజీ అయిపోతున్నారు.తాజాగా రాంచరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా సంజయ్ దత్ ని విలన్ గా ఎంచుకున్నారు.దాదాపు ఈ పాత్ర కోసం 10 కోట్ల రూపాయలకు పైగా పారితోషకం అందుకుంటున్నాడు సంజయ్.
ఇవి మాత్రమే కాదు డబ్బులు ఇస్మార్ట్ తో పాటు ప్రభాస్ రాజా సాబ్ లో కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారు.ఇదే దోవలో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్టుగా బాగానే పుంజుకున్నాడు.
నిన్న మొన్నటి వరకు అడప దడపా మాత్రమే హిందీ సినిమాల్లో కనిపించిన సైఫ్ విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోతున్నారు.ఆది పురుష్ సినిమా కోసం విలన్ గా నటించి 12 కోట్ల పారితోషికం అందుకున్నాడు

దాంతో దేవర సినిమాలో( Devara ) కూడా సైఫ్ అలీ ఖాన్ కి మంచి పాత్ర దొరికింది.ఇక కాస్త వెనక్కి వెళితే చాలా రోజుల క్రితమే బాలీవుడ్ లో అవుట్ డేట్ అయిపోయాడు అర్జున్ రాంపాల్.( Arjun Rampal ) అతడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విలన్ గా భగవంత్ కేసరి లో అద్భుతంగా నటించాడు.
దీనికోసం 3 కోట్ల రెమ్యునరేషన్ కూడా పుచ్చుకున్నాడు.ఇక ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు బాబి డియోల్( Bobby Deol ) అనిమల్ సినిమా ద్వారా.దీని తర్వాత బాబీ క్రేజ్ తో పాటు పారితోషకం కూడా పెరిగిపోయింది.వీటితో పాటు బాలకృష్ణ సినిమాలో అలాగే హరిహర వీరమల్లుతో పాటు కండువా లో కూడా నటిస్తున్నాడు.
వీరందరితో పాటు నేను కూడా రేసులో ఉన్నాను అంటూ వచ్చేశాడు ఇమ్రాన్ హాష్మి.( Emraan Hashmi ) గూడచారి 2 మరియు ఓజీ సినిమాల్లో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నారు దానికోసం 7 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నాడట.