గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినీ పరిశ్రమని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో సీరియల్ నటుడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సమీర్ శర్మ అనే సీరియల్ నటుడు షూటింగ్ పనుల నిమిత్తమై నివాసముంటున్నాడు.అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి సమీర్ శర్మ ఈ మధ్యకాలంలో కొంతమేర మానసిక ఒత్తిడులకు లోనవుతున్నాడు.
ఈ క్రమంలో ఏకంగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు పగల గొట్టి తెరిచి చూడగా నటుడు సమీర్ శర్మ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు.దీంతో వెంటనే మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
అలాగే స్థానికులు మరియు సమీర్ శర్మ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.