అల్లు అర్జున్ హీరోగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 ( Pushpa 2 )చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇంతకు ముందు వచ్చిన పుష్ప చిత్రం తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించిన విషయం తెలిసిందే.
సినిమా తో పాటు పాటలు.డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ కనెక్ట్ అవ్వడం జరిగింది.
అందుకే సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఒక ఆన్లైన్ మీడియా సర్వే చేయగా.
అందులో హిందీ ప్రేక్షకులు కూడా తాము పుష్ప 2 చిత్రం కోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ ముక్త కంఠంతో చెప్పారట.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Badshah Shah Rukh Khan ), సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
వాటిని పోలిస్తే పుష్ప 2 చిత్తం మాత్రమే భారీగా వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని.ఆ సినిమా కోసం మాత్రమే తాము వెయిట్ చేస్తున్నామని కొందరు ఆ సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

సర్వే ఫలితాన్ని బట్టి చూస్తూ ఉంటే దేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది.అంతే కాకుండా లాంగ్ రన్ లో కూడా భారీగా కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్ర లో సునీల్ మరియు అనసూయ నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్( Devi Shri Prasad ) అందిస్తున్న సంగీతం మరోసారి సినిమా స్థాయిని పెంచడం ఖాయం.
మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ తో ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను చేయించాలని భావిస్తున్నారు.
ఆ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







