బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ( Alia Bhatt )మళ్లీ కెమెరా ముందుకు రాబోతుంది.గర్భవతి అవ్వడంతో సినిమా లకు చిన్న బ్రేక్ తీసుకున్న ఆలియా భట్ మళ్లీ బాలీవుడ్ సినిమా తోనే రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలు అయ్యాయి.ఒకప్పుడు పెళ్లి అయిన హీరోయిన్స్ ను ఇండస్ట్రీ లో పట్టించుకునే వారు కాదు.
కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీ లో కూడా ముద్దుగుమ్మ లు పెళ్లి లు చేసుకుని పిల్లలకు తల్లులు అయినా కూడా హీరోయిన్ గా ఆఫర్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ముద్దుగుమ్మ ఆలియా భట్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నా అనగానే పదుల సంఖ్యలు దర్శక నిర్మాతలు ఆమె వద్ద క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది.మొత్తానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు అయిన నేపథ్యం లో అభిమానులతో పాటు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ వారు అంతా కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai Bachchan )తన బిడ్డ పెద్దగా అయిన తర్వాత కూడా హీరోయిన్ గా సినిమా లు చేస్తున్న విషయం తెల్సిందే.కనుక ఆలియా భట్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి రాబోయే పది పన్నెండు సంవత్సరాల వరకు హీరోయిన్ గా బిజీగా ఉండవచ్చు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అది ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది లో అయినా సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఆలియా భట్ ఇకపై సినిమా ల ఎంపిక విషయం లో గతంతో పోల్చితే కాస్త విభిన్నంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఆలియా రీ ఎంట్రీ అందరికి ఆమోద యోగ్యం.