తెలుగు సినిమా అంటేనే బాబోయ్‌ మీకో దండం అంటున్న ఆలియా భట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌( Alia Bhatt ) తెలుగు లో మొదటి సారి ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Bollywood Heroine Alia Bhatt Don't Want To Do Telugu Films ,alia Bhatt , Allu-TeluguStop.com

వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.పైగా నాటు నాటు పాట( Natu Natu song )కు గాను ఆస్కార్ అవార్డ్‌ కూడా దక్కింది.

అంతటి ఘనత దక్కించుకున్న ఆర్‌ఆర్ఆర్( RRR ) సినిమా తర్వాత ఆలియా భట్ నటించే విషయంపై ఆసక్తి చూపించడం లేదట.తెలుగు లో ఆలియా భట్ ను నటింపజేసేందుకు ఒక ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత ఆ మధ్య ప్రయత్నించారట.

ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా పెద్ద ప్రొడక్షన్ అయినా కూడా ప్రస్తుతానికి తెలుగు లో నటించే ఆసక్తి లేదు అంటూ తేల్చి చెప్పిందట.కారణం చెప్పలేదు కానీ ఆర్‌ఆర్‌ఆర్ లో తన పాత్రను మరీ చిన్న గా చేయడం వల్ల ఆమె అసంతృప్తిగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఆస్కార్‌ వచ్చిన సమయంలో ఇతర సక్సెస్‌ వేడుక సమయంలో కూడా ఆలియా ఆర్ఆర్ఆర్ గురించి స్పందించింది.కనుక ఆమె సినిమా పట్ల అసంతృప్తిగా లేదు అనేది కొందరి అభిప్రాయం.

అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆలియా ఇప్పటికే అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్‌ సినిమా ల్లో నటించేందుకు ఓకే చెప్పాల్సి ఉంది.కానీ ఎన్టీఆర్‌ సినిమాకు ఆలియా కాకుండా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఎంపిక అయింది.మరో వైపు అల్లు అర్జున్ సినిమా కోసం ఆలియా ను ఇంకా సంప్రదిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఎవరైనా బలమైన కథ చెప్పి ఆమె పాత్ర తో ఒప్పిస్తే తప్పకుండా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న ఆలియా భట్‌ నుండి వరుసగా తెలుగులో సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కానీ ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేయాలని ఆసక్తి మాత్రం కనిపించడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube