సర్జికల్ స్ట్రైక్ 2 కోసం సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసిన దర్శక, నిర్మాతలు!

దేశంలో ఎవైన ఆసక్తికర సంఘటనలు జరిగితే వాటిని బేస్ చేసుకొని రియల్ స్టోరీస్ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం బాలీవుడ్ దర్శక నిర్మాతలు చేస్తూ వుంటారు.

ముంబై టెర్రర్ ఎటాక్స్ నేపధ్యంలో బాలీవుడ్ లో రెండు సినిమాలు తెరకేక్కాయి.

అలాగే గతంలో ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ నేపధ్యంలో కూడా తాజాగా యూరీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి సుమారు 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.ఇంకా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.

ఈ కారణంగానే ఇండియాలో జరిగే టెర్రర్ ఎటాక్స్, ఇండియన్ ఆర్మీ చేసే వార్స్ కి బాలీవుడ్ లో ఎప్పుడు డిమాండ్ వుంటుంది.ఇదిలా వుంటే రీసెంట్ గా పుల్వామా ఉగ్ర దాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉగ్ర వాద స్థావరాలపై రెండో సారి సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఎయిర్ స్ట్రైక్స్ చేసాయి.

ఈ ఎయిర్ స్ట్రైక్స్ కి దేశ వ్యాప్తంగా విపరీతమైన మద్దతు లభించింది.కేవలం 12 మంది ఎయిర్ ఫైటర్స్ మాత్రమె ఈ సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు.

Advertisement

ఈ నేపధ్యంలో దీనిని కూడా హిందీలో సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన దర్శక, నిర్మాతలకి వచ్చేసింది.దీంతో ఉన్నపళంగా ఈ రియల్ కథ కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సినిమా టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయిన్చేసారు.

ఈ ఎయిర్ స్ట్రైక్స్ నేపధ్యంలో సుమారు పది వరకు సినిమా టైటిల్స్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు