తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఫరా ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఆమె నిర్మాతగా అలాగే కొరియోగ్రాఫర్ గా తనదైన ముద్రను వేసుకుంది.ఫరా ఖాన్ బాలీవుడ్ హీరో ఇండస్ట్రీకి చెందిన ఆమె అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కాగా ఈమె అందించిన చాలా పాటలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.అంతేకాకుండా 80 సినిమాల్లో దాదాపుగా 100 పైగా పాటలకు సంగీతాన్ని అందించింది.
అయితే మొదట మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈమె ఆ తర్వాత దర్శకురాలిగా మారింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరా ఖాన్ ఆమె నిజ జీవితంలో ఎదురైనా కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె ఆ చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయింది.

ఇటీవల ఇండియన్ ఐడల్ 13 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మా తండ్రి చనిపోయినప్పుడు కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి.
నాకు 18 ఏళ్ల వయసులో మా నాన్న మరణించాడు.ఆయనకు అంతక్రియలు నిర్వహించడం చాలా కష్టంగా మారింది.
నా సోదరుడు సాజిద్ ఖాన్ కు అప్పుడు 14 ఏళ్ళు.

ఆ సమయంలో మా బంధువులు ఇంట్లోనే ఒక స్టోర్ రూమ్ లో ఆరేళ్ల పాటు నివసించాము అని చెప్పుకొచ్చింది ఫరా ఖాన్.చివరకు వారికి ఇంటి స్థలం కూడా లేదని ఆమె తెలిపింది.కాగా ఫరా ఖాన్ సోదరుడు సాజిద్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 16 లో ఈ విషయం గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
మద్యం మత్తులో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలు చెల్లించడానికి కూడా కుటుంబం దగ్గర డబ్బు లేదని తెలిపాడు.ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలు రేషన్ కరెంట్ బిల్లుల కోసం డబ్బులు ఇచ్చారని తెలిపారు.







