ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరో( Pan India Star Hero )గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas ).ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లో దాదాపు 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాయి.
ఇక దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభాస్ ను ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారు.ఇప్పటివరకు పాన్ ఇండియాలో అత్యధికంగా కలెక్షన్స్ ను వసూలు చేసిన హీరో ల్లో కూడా ప్రభాస్ పేరు చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) అల్లు అర్జున్ ప్రభాస్ కి పోటీ ఇవ్వబోతున్నాడు అంటూ కొంతమంది బాలీవుడ్ జనాలు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బాలీవుడ్ సినిమా క్రిటిక్ అయిన కె ఆర్ కె మాత్రం ప్రభాస్ ని టచ్ చేసే హీరో ఇండియాలో ఎవరు లేరు ఆయనకి ఆయన పోటీ అంటూ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పాడు ఇక అల్లు అర్జున్ అయితే ప్రభాస్ ముందు అసలు నిలబడడానికి కూడా అర్హత లేదు.

ఎందుకంటే ప్రభాస్ తో ఆయన ఏ రకంగా పోటీ కాదు.ప్రభాస్ హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది,అలాగే బాడీ లో చూసుకున్న ప్రభాస్ బాడీ చాలా బలిష్టంగా ఉంటుంది.ఇక అందం విషయంలో అయితే ప్రభాస్ చాలా అందగాడు ఆయన ముందు అల్లు అర్జున్( Allu Arjun ) పొట్టి గా ఉంటాడు కూడా ఆయన రేంజ్ లో ఉండదు.ఇక ఆయన ముందు అల్లు అర్జున్ అందం అనేది అంతగా ఆనదు.
ఇక సినిమాలా కలెక్షన్ల విషయానికొస్తే పుష్ప సినిమా దాదాపు 250 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తే ప్రభాస్ బాహుబలి సినిమా 2000 కోట్ల వరకు వసూలు రాబట్టింది.

అలాగే 300 కోట్లకు పైన కలెక్షన్స్( 300Crore Collections Movies ) రాబట్టిన సినిమాల్లో ప్రభాస్ వి దాదాపు ఐదు సినిమాలు ఉండటం విశేషం అంటూ చెబుతూనే ప్రభాస్ అల్లు అర్జున్ కి ఏ రకంగా పోటీ కాదు.ఇప్పుడున్న హీరోలు ఎవరు కూడా ప్రభాస్ కి పోటీ కాదు అంటూ కే ఆర్ కే సంచలన కామెంట్లు చేశాడు…
.