సెలెబ్రిటీల( Celebrities ) సంపాదన కోట్లలో ఉంటుంది.అయితే వీరి ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనే విషయం తెలిసిందే.
మరి మామూలు లైఫ్ స్టైల్ లోనే లక్షల్లో ఖర్చు చేసే సెలెబ్రిటీలు ఇక పెళ్లి అనే ప్రతిష్టాత్మకమైన అంశంలో ఇంకెంత ఖర్చు చేస్తుంటారు.మరి బాలీవుడ్ సెలెబ్రిటీలు( Expensive Bollywood Weddings ) ఎవరు ఎన్ని కోట్లు తమ వివాహం కోసం ఖర్చు చేసారో ఇప్పుడు చూద్దాం.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహం( Parineeti Chopra Raghav Chaddha ) రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వీరు పెళ్ళికి సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు టాక్.

ఇక బాలీవుడ్ లో రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె, రణవీర్ సింగ్( Ranveer Singh Deepika Padukone ) అందరికి సుపరిచితమే.ఈ జంట కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2018లో ఇటలీలో తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకున్నారు.మరి ఆ తర్వాత బెంగుళూరు, ముంబై లలో రెసెప్షన్ కూడా జరిగింది.మొత్తంగా వీరు పెళ్ళికి ఏకంగా 75 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్( Priyanka Chopra Nick Jonas ) రాజస్థాన్ లో పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్ళికి వీరు కూడా కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.

అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ( Anushka Sharma Virat Kohli ) కూడా ఇటలీలోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఈ జంట ఏకంగా పెళ్ళికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసారని సమాచారం.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి కూడా వైభవంగా జరిగింది.ఈ జంట కూడా పెళ్ళికి 100 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్ వచ్చింది.

మరి బాలీవుడ్ లో గ్రాండ్ గా జరిగిన వివాహాల్లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి కూడా ఒకటి.ఈ జంట రాజస్థాన్ లో వివాహం చేసుకోగా కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు సమాచారం.ఇలా బాలీవుడ్ లో చాలా జంటలు తమ వివాహ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు.







