బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే( Actress Poonam Pandey ) కీలక ప్రకటన చేశారు.తాను ఇంకా చనిపోలేదని, బతికే ఉన్నానని తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పూనమ్ పాండే.గర్భాశయ క్యాన్సర్( Cervical cancer ) పై అందరికీ అవగాహన రావాలని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను చనిపోయినట్లు ప్రచారం చేశారన్నారు.తాను చనిపోలేదని, బతికే ఉన్నానని తెలిపారు.ఈ విషయంపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పూనమ్ పాండే వెల్లడించారు.కాగా నిన్న పూనమ్ పాండే చనిపోయినట్లు వ్యక్తిగత సిబ్బంది వెల్లడించిన సంగతి తెలిసిందే.







