తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ( Nora Fatehi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా టెంపర్( Temper ).
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ మెరిసిన విషయం తెలిసిందే.ఇక ఈ పాట తర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు పాటు మారుమోగిపోయింది.
అలాగే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.కిక్- 2, షేర్, లోఫర్, ఊపిరి లాంటి చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది.డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటింది.

ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా( Baahubali )లో మనోహరి సాంగ్‌తో మంచి క్రేజ్ సంపాదించింది.ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్‌లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సినిమాలతో పాటు టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది.కెరీర్ ఆరంభంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్న నోరా అందరి నోళ్లు మూయించేలా ఉన్నతస్థాయికి ఎదిగింది.

ఇది ఇలా ఉంటే ఈమెకుఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇబ్బందులు పడిన నోరాకు ఒక షూటింగ్ సెట్‌లో జరిగిన అవమానంపై తొలిసారి నోరు విప్పింది.గతంలో ది కపిల్ శర్మ షో( The Kapil Sharma Show )కు హాజరైన భామ ఈ విషయాన్ని వెల్లడించింది.రోర్: టైగర్ ఆఫ్ ది సుందర్‌బన్స్( Roar: Tigers of the Sundarbans ) షూటింగ్ సమయంలో సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.బంగ్లాదేశ్‌లో రోర్ మూవీ షూటింగ్ లో ఈ సంఘటన జరిగిందని నోరా పేర్కొంది.
మొదట అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడే లాగి చెంప దెబ్బ కొట్టానని తెలిపింది.కానీ ఆ గొడవ అంతటితో ఆగిపోలేదు.అతను తిరిగి నా జుట్టును పట్టుకుని లాగాడు అని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరింది.







