సినీ ఇండస్ట్రీ అన్నాక ప్రతి ఒక్కరు చాలా రిచ్ గా కనిపిస్తారు.ముఖ్యంగా హీరో హీరోయిన్లు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు.
నిజానికి హీరో హీరోయిన్లు వ్యక్తిగత విషయంలో చాలా పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటారు.తీసుకునే ఫుడ్ నుంచి తాము ధరించే దుస్తుల వరకు అన్ని రిచ్ గా ఆలోచిస్తూ ఉంటారు.
ఇక తాము తిరిగే వాహనాలు, తాము ధరించే విలువైన వస్తువుల ధరలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.మనం ఎన్నో రోజులు కూడబెట్టుకొని జమ చేసుకునే డబ్బును.
వాళ్లు క్షణాల్లో ఖర్చు పెడుతుంటారు.ఎందుకంటే వాళ్లకు ఆ డబ్బు చాలా తక్కువ అన్నమాట.
ఇక హీరోయిన్లు మాత్రం చాలా వరకు తమ మేకప్ లకు, తమ వస్త్రాలకే డబ్బులు ఖర్చు పెడుతుంటారు.
ధరించిన దుస్తులు మళ్లీ వాడకుండా నిత్యం కొత్త కొత్త డ్రస్సులతో దర్శనమిస్తూ ఉంటారు.
అలా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు నిత్యం ట్రెండ్ ను ఫాలో అవుతూ విలువైన దుస్తులను ధరిస్తూ కనిపిస్తారు.అలా తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా విలువైన డ్రెస్ ధరించి అందరి దృష్టిలో పడింది.

బాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ అనన్య పాండే తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది.ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ తెలుగులో కూడా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది.ఇక బ్యూటీ సినీ ఇండస్ట్రీకి అతి తక్కువ సమయంలో పరిచయమై మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.తొలి సినిమాతోనే తన నటనకు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.అదే ఏడాది మరో సినిమాలో కూడా నటించింది.ఇక వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ బ్యూటీ.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఫోటోల షేర్ల తో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫోటో పంచుకోగా అందులో తను విలువైన డ్రెస్ ధరించి కనిపించింది.ఇక దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా అందులో తను ఎరుపు రంగుతో ఉన్న డ్రెస్ ని వేసుకోగా దాన్ని ధర దాదాపు రూ.85,500 ఉంటాయని తెలుస్తుంది.
ఈ డ్రెస్ ధర ఇంత అని తెలియటంతో అందరూ తెగ షాక్ అవుతున్నారు.ఇక ఈ బ్యూటీ లైగర్ సినిమాతో పరిచయమైన కూడా ఎందుకో తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించ లేక పోయింది.
అంతేకాకుండా తన నటన బాగోలేదు అంటూ తెలుగు ప్రేక్షకులకు తనకు ఒక ముద్ర కూడా వేశారు.పైగా తను ఐరన్ లెగ్ అంటూ బాగా కామెంట్లు కూడా చేశారు.







